
తొగుట, వెలుగు: రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నారు. గురువారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తొగుట మండల కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రీతం గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం తొగుట నుంచి కాన్గల్ వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ..బానిసత్వంలో మగ్గుతున్న భారతదేశానికి గాంధీజీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ స్వాతంత్యాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రజల హక్కులకు రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు నడుంకట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అక్కం స్వామి, నరేందర్ రెడ్డి, శ్రీనకర్ రెడ్డి, పోచయ్య, రవి, పలు మండలాల నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.